Community Information
-
•
Services in Vijayawada need significant improvement. Bringing in more service vendors from outside can increase competition and help raise the bar.
నిన్న ఒక క్యాబ్ బుక్ చేశా . ఎకానమీ బుక్ చేస్తే సెడాన్ వచ్చింది. వచ్చిన డ్రైవరు , ఏసీ ఆన్ చేయను . కేవలం ప్రైమ్ బుకింగ్స్ మాత్రమే ఆన్ చేస్తాను అంటాడు ఏంటి ? వాడు కి రైడ్ ఇష్టం లేకపోతె అక్కడే క్యాన్సల్ చేసుకోవచ్చు కదా ? రెండో ప్రైమ్ క్యాబ్ బుక్ చేస్తే , వెరిటో అని చూపించింది . కానీ పాత డొక్కు ఇండికా వచ్చింది . ఏంటి బాబు అంటే, అది బ్రేక్ డౌన్ అయింది అని సింపుల్ గ చెప్పేసాడు . ఇక్కడ ప్రతీది కాస్త రేట్ ఎక్కువ, పని తనం తక్కువ., కానీ ఒక్కోడికి బలుపు మాత్రం బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, కూరగాయలు అయినా, ఆటో అయినా, ఫ్యాన్సీ షాపు అయినా, కొరియర్ సర్వీస్ అయినా అందరు అంతే. రాజధాని పూర్తి అయ్యి రకరకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ చేరితే కానీ, ఇక్కడి వాళ్ళకి కాస్త చలనం రాదేమో .. ఇలాంటి రుబాబు చేసే పరిస్థితి హైదరాబాద్ లో కూడా ఒకప్పుడు ఉంది. ఇప్పుడు , వాడు కాకపోతే ఇంకోడు అన్నట్లు ఉన్నాయి అక్కడ సర్వీసెస్ .3
© 2025 Indiareply.com. All rights reserved.