Community Information
-
Language Policy for the State
నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. కానీ ఏ స్టేట్ అయినా డెవలప్ అవుతూ ఉంటే నాన్ నేటివ్ స్పీకర్స్ సంఖ్య పెరుగుతుంది. దీన్లో ఏం తప్పు లేదు. రాను రాను హిందీ మాట్లాడేవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాగని ఆ తమిళ్ వాళ్ళ లాగా నేను వీళ్ళని హేట్ చేయాలనుకోవట్లేదు. నేను మన రాష్ట్రం ఒక లాంగ్వేజ్ పాలసీ ని అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా. నేననుకుంటున్న లాంగ్వేజ్ పాలసీ: మన ఇండియా లో ఎవరైనా తెలంగాణ కి వచ్చి పని చేసుకోవచ్చు అండ్ వాళ్ళు వాళ్ళ భాష ను కూడా మాట్లాడుకోవచ్చు. దీనిని మనం ఆప కూడదు. కానీ వాళ్ళు తెలంగాణ లో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం వాళ్లకు పుట్టబోయే పిల్లలకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయి ఉండాలని ఒక కండిషన్ పెట్టాలి. వాళ్ళు చదివే తరగతి గది లో 75% తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండాలి. ఇలాగైతే నాన్ నేటివ్ స్పీకర్స్ యొక్క పిల్లలు నేటివ్ తెలుగు స్పీకర్స్ గా నేచురలైజ్ అవుతారు అండ్ వాళ్ళ తల్లిదండ్రులు వయసు అయిపోయి చని పోతారు. కొత్త భాష నేర్చుకోవటం చాలా కష్టం. చాలా మందికి టైం ఉండక పోవచ్చు లేదా కుదరక పోవచ్చు. ఇంకా పిల్లలు భాష తొందరగా నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళ క్లాస్రూమ్ లో 75% తెలుగు స్పీకర్స్ ఉంటారు కాబట్టి. మీరేమనుకుంటున్నారు?1
© 2025 Indiareply.com. All rights reserved.