Community Information
-
CBN 4.0 till now sucks
ఇలాంటి దరిద్రం నేనెప్పుడూ చూడలేదు బ్రో😟🙄 జగన్ అంటే అధికారులకి భయం. (ఎవరైనా భయపెట్టి పనిచినుకోగలడు ఉదాహరణ కి ఏవీబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్) ఏ కారణం లేకుండా సస్పెండ చేసి సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళాడు పదవి ఇవ్వకుండా ఉండటానికి. బయటెట్టి డబ్బు ఆశా చూపి పని చేయించుకుంటారు కానీ సీబీఎన్ అలా కాదు. సిస్టం ని ఫాలో అవుతాను అంటాడు అధికారులు మాట వినరు ✍️ఒక పక్కన మంత్రి పార్ధ సారధి మీద కంప్లైంట్స్. ✍️ఇంకో పక్కన RRR ని హింసించిన కేసు లో తులసిబాబు అనే వాడిని అరెస్ట్ చేస్తే వెనిగండ్ల రాము కలిసి గంట పాటు ముచ్చట్లు పెడతాడు. ✍️ఇంకో పక్కన హోమ్ మినిస్టర్ PA మీద కంప్లైంట్స్ వస్తే, అతన్ని తీసేసారు. ✍️ఇంకో పక్కన, మొన్న చంద్రబాబు మీటింగ్ పెట్టి... జగన్ రెడ్డి లడ్డు లా దొరికాడు, కానీ అరెస్ట్ చేయము అన్నట్లు చంద్రబాబు నీతులు చెప్తాడు. ✍️ఇంకో పక్కన , ప్రతి రోజూ ఎవడో ఒకడు గురించి న్యూస్పేపర్ లో వస్తది. వాడు వైసీపీ కి అనుకూలం గా పని చేసిన అధికారి అని. అపుడు సోషల్ మీడియా లో అందరు రియాక్ట్ అవుతారు. అపుడు ప్రభుత్వం వాళ్ళని మారుస్తుంది. ✍️ఇంకో పక్కన, టీటీడీ లో అధికారులు మధ్య సమన్వయం లేదు. అక్కడ కూడా వైసీపీ కి అనుకూలం గా పని చేసే బ్యాచ్. ఉద్యోగులకి name badge పెట్టాలి అనుకుంటే, ఆపుతుంది ఎవరు ? ✍️మొన్న ఒక మీటింగ్ లో చంద్రబాబు కి ఒక అతను చెప్పాడు. 1000 కోట్లు పెట్టుబడులు పెట్టించగలను. కానీ 3 సార్లు ఇమెయిల్ చేసినా నాకు ప్రభుత్వం నుండి సమాధానం లేదు అని. అసలు ఎందుకు ఇమెయిల్ కి సమాధానం ఇవ్వలేదు ? అక్కడ ఉన్న సెక్రటరీ IAS ప్రద్యుమ్న భార్య ఏమో వైసీపీ పార్టీ లీగల్ టీం లో ఉంది అంటున్నారు. ✍️ఇంకో పక్కన, ఏదో సోషల్ మీడియా లో బూతు పోస్ట్లు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసారు. అసలు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, రౌడీలు లా ప్రవర్తించిన వైసీపీ నాయకులని అరెస్టులు చేయలేదు. చేసే దమ్ము లేదు ! దమ్ము లేక.. మంగళవారం కబురులు. ✍️పెద్ది రెడ్డి లాంటి వాళ్ళ మీద ఎం కేసులు పెట్టారు ? ఎం పీకారు ? రోజా రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశి, అంబటి రాంబాబు, etc ... ఇలా చాలా మంది ఉన్మాదుల బ్యాచ్ ఉంది. ✍️అసలు ఎం జరుగుతుంది, ఏ నియోజకవర్గం లో ఎం జరుగుతుందో తెలుసా ? 164 మంది ఉన్నారు... కానీ గట్టిగా 10 కనిపిస్తున్నారు మీడియా లో. ఏదైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడే వాళ్ళు, గట్టిగా 5 మంది లేరు ! ✍️ఇంకో పక్కన, మొన్న పోలవరం నిర్వాసితులకు సుమారు 1000 కోట్లు, వాళ్ళ బ్యాంకు అకౌంట్స్ లో వేశారు. అసలు ప్రచారం చేయలేదు. ఎవడికీ తెలియదు. ప్రభుత్వం లో ఉన్న వాళ్లకి తెలియకుండా ఆ డబ్బులు వేసేసారు అని ఎక్కడో చదివాను. ప్రభుత్వం లో ఉన్న వాళ్ళకి తెలుసు అని కవర్ చేస్తారా... అలా అయితే న్యూస్పేపర్ లో వచ్చే వరకూ అసలు ఎవరికీ ఎందుకు తెలియదు ? న్యూస్పేపర్ లో వచ్చాకే ఫైనాన్స్ మినిస్టర్ మీడియా తో మాట్లాడారు. అంటే.. ప్రభుత్వం లో ఎం జరుగుతుందో.. మీకు తెలియదు. గుడ్డి ఎద్దు వచ్చి చేలో పడ్డట్టు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇదే జగన్ రెడ్డి అయితే 4 సార్లు గా, 4 సంవత్సరాలు వేసేవాడు ఆ డబ్బులు. 4 నెలలు ప్రచారం చేసుకునే వాడు. ................................ఇలా చెప్పుకుంటూ పోతే...చాలా ఉన్నాయి. ✍️వైసీపీ ప్రభుత్వం లో...వాడు ఆ అవినీతి చేసాడు, ఈమె ఇది చేసింది... అని చెప్తారు. ఒకరిని కూడా అరెస్ట్ చెయ్యరు, కేసు పెట్టరు, పెట్టినా అది ముందుకి వెళ్ళదు. అలాంటపుడు ప్రజలు ఎలా నమ్ముతారు ? 📌చంద్రబాబు మారడు. లోకేష్ ని పక్కన దొబ్బారు, సైలెంట్ గా ఉంటున్నాడు. ఇక పీకేది ఎం లేదు. పీకటానికి ఎవరూ లేరు ! 📌మళ్ళీ ఎలక్షన్స్ కి 2019 కథే ! 📌మొన్న JC ప్రభాకర్ రెడ్డి చెప్పాడు. అతను 2019 ముందు కూడా ఇలాగే చెప్పాడు. చంద్రబాబు మారాలి అని. కానీ మారడు ! 📌మీరు అభివృద్ధి అంటారు, రాజకీయం చెయ్యరు. జగన్ అభివృద్ధి చెయ్యడు, రాజకీయం చేస్తాడు. ఎం తేడా ఉంది ? ఎం లేదు ! రెండూ సమానం గా చేయాలి కదా ! ✏️అసలు ప్రభుత్వం కి పని చేసే అధికారులని పెట్టుకోకపోతే, మీరు ఎంత కష్టపడినా వృధానే కదా ! ✏️వైసీపీ బ్యాచ్ కావాలని చెడకొడతారు. ✏️మీ కష్టం బూడిద లో పోసిన పన్నీరు అవుతుంది. ✏️ప్రభుత్వ పెద్దలు మారకపోతే, నిద్రపోతుంటే... మాకేం దురద ! ✏️అభివృద్ధి అని మీరు ఎంత రుద్దినా ప్రజలకి ఎక్క్కదు. రాజకీయం ఎలా చేయాలో... కొంచం జగన్ రెడ్డి దగ్గర నేర్చుకోండి. ✍️ముందు ప్రభుత్వం మీద కంట్రోల్ తెచ్చుకోండి. ప్రభుత్వ అధికారులని మార్చండి. ప్రభుత్వం కోసం పని చేసే వాళ్ళని పెట్టుకోండి. ✍️నీతులు చెప్పటం ఆపండి చంద్రబాబు గారు. అనుకూలం గా ఉన్న వాళ్ళని పెట్టుకోండి. ఒక నెల పట్టినా సరే, ముందు అధికారులందరిని మార్చండి. అప్పుడు వరకూ దండం 🙏🙏 CC: Nara Lokesh Nara Chandrababu Naidu Telugu Desam Party (TDP) 🙏🙏5
© 2025 Indiareply.com. All rights reserved.