Community Information
-
మా కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడుతుంటే,ఈ కలత(?) వారి లో కనిపించింది
మా వాళ్ళు (కొంతమంది కుటుంబ సభ్యులు,బంధువులు) నాయకులు, సినీమా నటులు లేదా కళాకారులని తమ తమ కులాలకు చెందుతారని చెబుతుంటే కొద్దిగా కష్టం వేస్తుంది, మనసు చిన్నబుచ్చుకుంటుంది. రామారావు గారు, నాగేశ్వర రావుగారు, సిరివెన్నెల గారు, సి.నా.రె, ఆరుద్ర, విశ్వనాధు గారు, చిరంజీవి గారు కూడా ... గొప్ప కళాకారులు ఉమ్మడి ఆంధ్రుల సంపత్తి. అలా అంటే వీరు "మా" వారని మేమూ సంతోషిస్తాము. ఆయా మహానుభావులు మీ కులానికి చెందినా, వారిని మీరు ఆంధ్ర దేశం కు అంకితం చేసి, తెలుగు తల్లి పాదాల చెంత నైవేద్యం చేస్తే అందులో మీకూ గౌరవం ఉంది, మాకూ తృప్తి ఉంది. --- కొన్నాళ్ల క్రితం ఒక సభ్యుడిని ఈ అర్థం వచ్చేటట్టు ఓ మీము రచించగలరేమోనని అభ్యర్థించాను. మీ లో ఎ వరైనా చేయగలిగితే సంతోషిస్తాను. మీరే పోస్టు చేసినా ఫరవాలేదు. ధన్యోస్మి! (నా వేళ్ళు నొప్పి పుడుతున్నాయి, ఎక్కువగా టైపు చేయలేను ప్రస్తుతానికి. పూర్తిగా కోలుకోవడానికి ఇంకొంత వ్యవధి పట్టేటట్టుంది) EDIT: కలత అనేది సరైన పదమేనా?అంటే ఈ సంధర్భంలొ ఉపయోగించ దగిన పదమేనా అని ప్రశ్న!5
© 2025 Indiareply.com. All rights reserved.